శ్రీరెడ్డి సీరియల్ : ఫిల్మ్ ఛాంబర్ ఎదుట మాధవీలత దీక్ష

Maadhavi-lathaసినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతుంది. శ్రీరెడ్డి రాజేసిన నిప్పు ఇప్పుడు రచ్చకెక్కింది. రోజుకొకరిపై కామెంట్స్ చేయటం.. ఆ తర్వాత దానికి వారు కౌంటర్ ఇవ్వటం.. ఆ తర్వాత కేసులు ఇలా శ్రీరెడ్డి సీరియల్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మెగా హీరోలు స్పందించగా.. ఇప్పుడు హీరోయిన్ మాధవీలత రంగంలోకి దిగింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట దీక్షకి దిగింది హీరోయిన్ మాధవీలత.

మాధవీలత అనూహ్య నిర్ణయానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా మద్దతు పలికారు. తలకు నల్ల బ్యాండ్ కట్టారు. మౌనమే నా ఆయుధం, మానం మర్యాద మంట కలుస్తున్నప్పుడు మౌనమే నా సమాధానం, సమస్యపై పోరాడదాం అసభ్య పదజాలం మన సంస్కృతి కాదు అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. పోరాటం అంటే తిట్టేకాదు.. మౌనంగా కూడా సాధించవచ్చు అంటూ నినాదాలు చేశారు మాధవీలత. ఆమె దీక్షకి దిగగానే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో శ్రీరెడ్డి మద్దతుదారులు కూడా ఫిల్మ్ ఛాంబర్ దగ్గరకి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీక్ష విరమించాలని కోరారు. మాధవీలత ససేమిరా అనటంతో.. బలవంతంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో దీక్ష కొనసాగిస్తానని మాధవీలత తన ఫేస్ బుక్ అకౌంట్ లో కామెంట్ పెట్టింది.

Posted in Uncategorized

Latest Updates