శ్రీవారిపై భక్తితో..ఫ్రీగా తిరుపతికి తీసుకెళ్తాడు

తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందంటారు. అందుకే తన జీవితంలో వేయి ఎనిమిది సార్లు స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చుక్కల వేణుకుమార్. తిరుపతికి వెళ్లిన ప్రతిసారి తనతో పాటు కొంతమంది పేదలు, దివ్యాంగులు, అనాథలను తీసుకొని వెళ్తుంటారు. ఆరు నెలలకు ఒకసారి తనతో పాటు 250 మందిని తిరుపతికి తీసుకెళతారు వేణుకుమార్. ఐదు రోజుల పాటు అక్కడే ఉంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని రానున్న రోజుల్లో మిగతా ప్రాంతాల విస్తరిస్తామని చెబుతున్నారు.

శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకన్న దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. కొంతమంది అన్నదానం, విద్యాదానం చేస్తుంటే వేణుకుమార్ దైవదర్శనం చేయిస్తున్నారని చెబుతున్నారు. తిరుపతితో పాటు యాదాద్రి, భద్రాచలం కూడా తీసుకెళ్తోంది, శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్.

 

Latest Updates