శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల

TTD TIతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌ లైన్‌ లో శుక్రవారం (జూలై-6) ఉదయం 10 గంటలకు విడుదల చేసింది TTD. 2018 అక్టోబర్ నెలకు సంబంధించి 53 వేల 642 టికెట్లను విడుదల చేశారు. జూలై-6 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి TTD వెబ్ సైట్ లో ఈ టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు అధికారులు.

టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి

ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 9 వేల 742 సేవా టికెట్లు, సుప్రభాతం 7 వేల 597, తోమాల 90, అర్చన 90, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 1వెయ్యి725, కరెంటు బుకింగ్ కింద 43 వేల900 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. విశేషపూజ 2వేలు, కల్యాణోత్సవం 9వేల975 సేవా టికెట్లు, ఊంజల్ సేవ 3వేల150, ఆర్జిత బ్రహ్మోత్సవం 5 వేల775 టికెట్లు, వసంతోత్సవం 11 వేలు, సహస్రదీపాలంకరణ 12వేల టికెట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates