శ్రీవారి కొండపై నిప్పురవ్వులు : లడ్డూ బూందీ పోటులో మంటలు

TTD-Laddu-Makingతిరుమల శ్రీవారి ఆలయ లడ్డూ బూందీ పోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న లడ్డూ ప్రసాదం కోసం బూందీ తయారు చేసే క్రమంలో.. పొగను బయటకు పంపే బ్లోయర్ పైప్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోడలపై పేరుకుపోయిన నెయ్యికి అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బూందీ పోటు సిబ్బంది, ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సిబ్బంది అంతా సురక్షితంగా బయటకు వచ్చారు. ఎంత నష్టం జరిగిందనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates