శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయి: TTD

lord-balajiతిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పై చేసిన ఆరోపణలు.. విమర్శలపై TTD ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పందించారు. ఇటీవల TTD బోర్డు తీసుకున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో వివరణ ఇచ్చారు. స్వామివారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయన్నారు. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. స్వామివారికి వచ్చిన నగలన్నింటినీ ఏటా ప్రజల ముందు ఉంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు సింఘాల్‌.

Posted in Uncategorized

Latest Updates