శ్రీవారి సన్నిధిలో.. సంతోష్ కుమార్, బాల్క సుమన్

BALKA TTDతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్. శుక్రవారం (జూలై-6) ఉదయం VIP విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక ద్వారా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి, బస ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో సంతోష్ కుమార్, సుమన్‌కు ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టు వస్ర్తాలతో సత్కరించారు. వీరితో పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహకార కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు శ్రీవారిని దర్శించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates