శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు : టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల అన్నమయ్య భవన్లో దీనిపై ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 12 నుండి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 9 నుండి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు దృష్టిలో ఉంచుకుని మెరుగైన ఏర్పాట్లు చేస్తామన్నారు. రాత్రి జరిగే వాహనసేవల సమయంలో మార్పులు చేశారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే గరుడ వాహనసేవను రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ధ్వజారోహణం రోజు ఏపీ సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates