శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి

తిరుమల శ్రీవారిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలసి మహాద్వారం దగ్గరకు చేరుకున్న వెంకయ్యనాయుడికి ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. తర్వాత శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఉప రాష్ట్రపతి కొద్దినిమిషాల పాటు స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధి నుంచి ప్రదక్షిణంగా హుండీ దగ్గరకు చేరుకుని కానుకలు సమర్పించారు. అక్కడి నుంచి రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌,JEO శ్రీనివాసరాజు కలసి స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని, శ్రీవారి ఫొటోలతో ముద్రించిన 2019 క్యాలెండర్‌, డైరీలను అందజేశారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్బంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు వెంకయ్య నాయుడు. విధి నిర్వహణలో మరింత శక్తిని ప్రసాదించమని, భారతదేశ ప్రజలు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నానన్నారు.

Posted in Uncategorized

Latest Updates