శ్రీవారిని దర్శించుకున్న తలసాని

తిరుమల :  తెలంగాణలో వచ్చే ఎన్నికలలో TRS ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ  (సెప్టెంబర్-27)న ఉదయం VIP విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. TRS ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. TRS వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని..  ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి, మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. అన్ని సర్వేలు కూడా TRS కు అనుకూలంగా వచ్చాయని, స్వామి వారిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుపొందేలా ఆశీర్వదించాలని కోరుకున్నానని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Posted in Uncategorized

Latest Updates