శ్రీవారి సేవలో మంత్రి హరీష్

harish-tirupathiతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి హరీష్ రావు. కుటుంబ సమేతంగా ఆదివారం(ఫిబ్రవరి-11) తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు హరీష్. తిరుమల తిరుపతి దేవస్థానం లాగే యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకుముందు హరీష్ కు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు.

Posted in Uncategorized

Latest Updates