శ్రీవారి సేవలో వివేక్ వెంకట స్వామి కుటుంబం

Govt-Advisor-G-Vivek-With-Family-Visits-Tirumala-Tirupati-Templeతిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్ దర్శించుకున్నారు. గురువారం(జులై-5) ఉదయం నైవేద్య విరామ సమయంలో వివేక్, వినోద్ సోదరులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెలించుకున్నారు. ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వివేక్, వినోద్ దంపతులకు ఆలయ అర్చకులు వేదశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కూతురు వైష్ణవి వివాహం తర్వాత స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు వివేక్. తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని స్వామవారిని ప్రార్థించానన్నారు వివేక్ వెంకటస్వామి.

Posted in Uncategorized

Latest Updates