శ్రీశాంత్ కేసు : BCCI కి సుప్రీం నోటీసులు

sreesanthభారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(BCCI)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ క్రికెటర్‌ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సోమవారం (ఫ్రిబవరి-5) అతని అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. జీవిత కాల నిషేధం సరికాదన్నారు. మళ్లీ క్రికెట్‌ ఆడాలన్నది తన కల అని చెప్పిన శ్రీశాంత్.. ఖచ్ఛితంగా తనకు న్యాయ జరుగుతుందన్నారు.  శ్రీశాంత్‌ నిషేధ అంశం పై వివరణ కోసం BCCIకు నాలుగు వారాల గడువు విధించినట్లు తెలుస్తోంది.

2013 IPL సీజన్‌లో శ్రీశాంత్‌తోపాటు ఇద్ద‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చ‌వాన్‌ల‌ను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే, కేరళ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ BCCI.. హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటంతోనే తాము నిషేధం విధించామని చెబుతూ.. పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. BCCI వాదనను సమర్థిస్తూ.. అతడిపై కేరళ హైకోర్టు నిషేధాన్ని పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

 

Posted in Uncategorized

Latest Updates