శ్రీ‌నివాస క‌ళ్యాణం : ఆనంద రాగాల శుభయోగం

SRINIVASA KALYANAMనితిన్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ శ్రీ‌నివాస క‌ళ్యాణం. ఈ మూవీకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేం స‌తీష్ వేగేశ్న డైరెక్ట‌ర్. మార్చి 23 నుంచి షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీలో నితిన్ సరసన రాశీఖ‌న్నా, నందితా శ్వేతాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  శ్రీరామనవమి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు నిర్మాత దిల్ రాజు.

కల్యాణం వైభోగం..ఆనంద రాగాల శుభయోగం అనే ఈ సాంగ్ ఫ్యామిలీని ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియోను సోమవారం (మార్చి-26) నితిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ట్విట్ చేసిన నితిన్.. ఈ సినిమాలో ఈ సాంగ్ తనకెంతో ఇష్టమని తెలిపాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. ప్రస్తుతం నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగా ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే.


Posted in Uncategorized

Latest Updates