శ్లాబుల మార్పులు: GST తో దిగొచ్చిన ధరలు


మధ్యతరగతి ప్రజలకు మరింత ఊరట కలిగించింది జీఎస్టీ కౌన్సిల్. మరిన్ని వస్తువుల శ్లాబ్ లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శానిటరీ న్యాప్ కిన్ లపై ట్యాక్స్ రద్దు చేసింది. గతంలో వీటిని 12 శాతంలో శ్లాబ్ లో పెట్టింది ప్రభుత్వం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయం మార్చుకుంది జీఎస్టీ కౌన్సిల్. రాఖీలపైనా ట్యాక్స్ రద్దు చేసింది. రాళ్లు, మార్బుల్స్ తో తయారు చేసే దేవతా విగ్రహాలపై GST తొలగిస్తున్నట్టు చెప్పారు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్.

వెయ్యి రూపాయల లోపు చెప్పులు, షూ ను 5 శాతం శ్లాబ్ లోకి తీసుకొచ్చారు. హ్యాండ్ బ్యాగులు, జువెల్లరీ బాక్స్ లు, కర్రతో చేసిన బాక్స్ లు, గ్లాస్ తో చేసిన కళాఖండాలు, చేతితో తయారుచేసిన దీపాలను 12 శాతం శ్లాబ్ లోకి, ఇంపోర్టెడ్ యూరియాను 5 శాతం శ్లాబ్ లోకి తీసుకొచ్చారు.

వాషింగ్ మెషిన్లు, లిథియమ్ అయాన్ బ్యాటరీలు, వాక్యూమ్ క్లీనర్లు, ఫుడ్ గ్రైండర్లు, మిక్సర్ లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, హెడ్ డ్రయర్లు, హ్యాండ్ డ్రయర్లు, పేయింట్, వార్నీష్, వాటర్ కూలర్ లు, మిల్క్ కూలర్, ఐస్ క్రీం కూలర్ లు, పర్ ఫ్యూం లు, టాయిలెట్ స్ప్రే లను 28 శాతం శ్లాబ్ నుంచి 18 శ్లాబ్ లోకి తీసుకొచ్చారు. 18 శాతం శ్లాబ్ లో ఉన్న ఇథనాయిల్ ను 5 శాతం శ్లాబ్ లోకి తీసుకొచ్చారు. కౌన్సల్ నిర్ణయంతో మొత్తంగా దాదాపు వంద వస్తువుల ధరల్లో మార్పులు జరగనున్నాయి. ఇవి  ఈ నెల 27 నుంచి అమలులోకి రానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates