శ‌బ‌రిమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధం

శబరిమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు కేరళ హైకోర్టు ప్రకటించింది. కొండకు వచ్చే భక్తులు ఉపయోగించే ప్లాస్టిక్‌ కారణంగా పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. దీంతో కొండను పర్యావరణ హిత యాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శబరిమల ఆలయంలోని ప్రధాన అర్చకుడు సూచించినట్లుగా సహజంగా సులువుగా కుళ్లిపోయే ఉత్పత్తుల్ని మాత్రమే తమ ఇరుముడుల్లో భక్తులు తీసుకురావాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో నిషేధాన్ని అమలు చేయాల‌ని ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates