షరీఫ్‌ కు ట్రీట్ మెంట్ : డాక్టర్ కు గుండెపోటు

అవినీతికి పాల్పడిన కేసులో అరెస్టైన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. దాంతో ఆయన్ను రావల్పిండి ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న పిమ్స్‌(పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌)కు తీసుకెళ్లారు. ఇజాజ్‌ ఖదీర్‌ అనే వైద్యుడి పర్యవేక్షణలో నవాజ్‌ చికిత్స పొందుతున్నారు. అయితే..సోమవారం ఇజాజ్‌ కు గుండెపోటు వచ్చిందట.

దాంతో ఆయన్ను ఇదే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నవాజ్‌ ను పిమ్స్‌ కు తరలించిన కొద్ది గంటలకే ఇజాజ్‌ కు గుండెపోటు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాంతో మరో సీనియర్‌ డాక్టర్ ని నవాజ్ కోసం నియమించినట్లు తెలిపారు. పిమ్స్‌ కు తరలించనున్నట్లు తెలిసి నవాజ్‌ ముందు ఇందుకు ఒప్పుకోలేదట. అయితే ఆయన ఆరోగ్యం విషమిస్తుండడంతో తరలించక తప్పలేదని చెప్పారు. అవెన్యూ ఫీల్డ్‌ కేసులో పాకిస్థాన్‌ కోర్టు నవాజ్‌ షరీఫ్‌ కు పదేళ్లు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates