షాకింగ్ : అందరివీ మారిపోతాయ్ : 13 అంకెల మొబైల్ నెంబర్ వస్తోంది

digitsమొబైల్ నెంబర్ ఎంతా అంటే.. 10 అంకెలు చెబుతాం. ఇక నుంచి అలా కుదరదు. 13 అంకెల నెంబర్ చెప్పాల్సిందే. అవును 2018, జూలై ఒకటో తేదీ నుంచి కొత్త సిరీస్ రాబోతున్నది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్ టూ మొబైల్ (M 2 M) కస్టమర్లకు కొత్త సిరీస్ తో ఉన్న 13 అంకెల నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి కొత్తగా సిమ్ కార్డ్ తీసుకునే వారికి ఈ నెంబర్లు ఇస్తారు. అన్ని మొబైల్ కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

పాత నెంబర్ల సంగతి ఏంటీ?

ఇప్పటికే దేశంలో 100 కోట్ల నెంబర్లు ఉన్నాయి. ప్రస్తుత వినియోగదారులు కూడా 13 అంకెల నెంబర్ లోకి మారాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు పాత కస్టమర్లు అందరూ నెంబర్ పోర్టబులిటీ చేసుకోవాలి. అంటే టెలికాం శాఖ తీసుకొచ్చే నిబంధనలకు లోబడి.. వీరికి మరో మూడు అంకెలు యాడ్ అవుతాయి. పాత కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. హైరానా, ఆందోళన పడొద్దని వినియోగదారులను కోరింది. డిసెంబర్ 31వ తేదీ వరకు పాత నెంబర్లు యథావిధిగా పని చేస్తాయని తెలిపింది. పాత నెంబర్ చెప్పినా.. అది కొత్త 13 అంకెల నెంబర్ లోకి మారుతుందని.. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ప్రకటించింది టెలికాం శాఖ.

10 అంకెలు కొట్టినా.. 13 అంకెల్లోకి మార్పు!

13 అంకెల మొబైల్ నెంబర్ సిరీస్ కు టెలికాం శాఖ ఆమోదించినట్లు టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉన్న 10 అంకెల నెంబర్ కూడా పని చేసే విధంగానే కొత్త నంబరింగ్ విదానం ఉంటుందని.. కస్టమర్లు ఎలాంటి ఆందోలన పడాల్సిన అవసరం లేదని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఎవరూ ఎలాంటి వదంతులను నమ్మొద్దని కూడా తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates