షాకింగ్ : తోటలోకి వచ్చి చిన్నారిని తినేసిన పులి

ak

తమిళనాడు రాష్ట్రం వణికిపోయింది. కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఘటనతో షాక్ అయ్యారు అందరూ. పొల్లాచి పట్టణంలోని శివార్లలో ఓ తోటలోకి వచ్చిన పులి.. ఆడుకుంటున్న చిన్నారిని తినేసింది. వివరాల్లోకి వెళితే.. పొల్లాచి పట్టణం శివార్లలో టీ తోటలు ఉన్నాయి. అక్కడ వందల మంది పని చేస్తుంటారు. దశాబ్దాలుగా ఇక్కడ తోటలు ఉన్నాయి.. పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం.. టీ తోటలో పని చేస్తున్నారు కూలీలు. వీరిలో నాలుగేళ్ల చిన్నారి అక్షయ్ నాథ్ తల్లిదండ్రులతో వచ్చాడు. తోటలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో తోటలోకి పులి వచ్చింది. చిన్నారిపై దాడి చేసింది. తినేసింది. పిల్లాడి అరుపులు, కేకలు వినిపించకపోవటంతో అనుమానం వచ్చిన కూలీలు.. తోటను గాలించారు. ఓ చోట చిన్నారిని తింటున్న పులి కనిపించింది. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పులిని తరిమికొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అందరిపై దాడికి ప్రయత్నించింది. ఆ ప్రదేశం నుంచి చిన్నారిని ఈడ్చుకు వెళ్లింది. అటవీ అధికారులు తోట అంతా గాలించి చిన్నారి శరీర భాగాలను పోస్టుమార్టంకి తరలించారు. కేసు నమోదు చేశారు. టీ తోటలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని చెబుతున్నారు అక్కడ పనిచేసే స్థానికులు.

 

Posted in Uncategorized

Latest Updates