షాకింగ్ : ప్రముఖ టీవీ నటి ప్రియాంక ఆత్మహత్య

ప్రముఖ టీవీ నటి.. సినిమాల్లోనూ నటించిన ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. తమిళంలో ఎంతో పాపులర్ అయిన వంశం అనే సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. ఆ సిరియల్ లో జ్యోతిక అనే పాత్ర పోషించారు. అప్పటి నుంచి ప్రియాంక కంటే జ్యోతికగానే అందరికీ పరిచయం అయ్యారు ఈ నటి. వంశం సీరియల్ తో వచ్చిన పాపులారిటీతో.. చాలా సినిమాల్లోనూ నటించారు. ఎప్పుడూ ఉత్సాహంగా, చలాకీగా ఉండే నటి ప్రియాంక ఆత్మహత్య తమిళ టీవీ రంగాన్ని షాక్ కు గురి చేసింది.

చెన్నై సిటీలోని వలసరవక్కాం ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. జూలై 18వ తేదీ బుధవారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చింది. ఎంత సేపటికీ తలుపులు తీయలేదు. దీంతో అపార్ట్ మెంట్ నిర్వహకులతోపాటు, పోలీసులకు కంప్లయింట్ చేశారు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లిన వారు షాక్ అయ్యారు. బెడ్ రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్న ప్రియాంక కనిపించింది. అప్పటికే చనిపోయి ఉంది. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.

ప్రియాంకకి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. మూడు, నాలుగు నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇంట్లో ఒంటరిగానే ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు. కుటుంబంలో గొడవలు కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తను విచారిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates