షాకింగ్ వీడియో.. ఇప్పటికైనా మారండి : సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఇలా చనిపోయాడు

షాకింగ్.. నిజంగా. పనిపై బయటకు వచ్చిన వ్యక్తి.. సెల్ ఫోన్ మాట్లాడుతూ చనిపోయాడు. జరిగింది రోడ్డు ప్రమాదమే అయినా.. ఇదంతా అతని స్వయంకృతాపరాదం అని స్పష్టంగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆలోచింపజేస్తోంది.. ఇప్పటికైనా మారండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అనే దానికి ఈ వీడియోనే సాక్ష్యం అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీ బహుదూర్ పుర ప్రాంతంలో ఓ వ్యక్తి షాపింగ్ కోసం బయటకు వచ్చాడు. ఓ షాపు దగ్గర పని ముగించుకున్నాడు. తిరిగి బైక్ దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో ఫోన్ వచ్చింది. హెల్మెట్ లేదు.. ఫోన్ మాట్లాడుతూనే బైక్ తీశాడు. ముందూ వెనకా ఆలోచించకుండా ఫోన్ మాట్లాడుతూనే.. బైక్ ను రోడ్డుకు అడ్డంగా క్రాస్ చేశాడు. ముందు వెహికల్స్ వస్తున్నాయో లేదో కూడా చూసుకోలేదు. అడ్డంగా రోడ్డు దాటేశాడు.. స్పీడ్ గా వస్తున్న ఆటో నుంచి తప్పించుకున్నా.. ఈ బైకర్.. ఆటో వెనక వస్తున్న బైక్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. నేరుగా వస్తున్న బైక్.. ఫోన్ మాట్లాడుతూ అడ్డంగా రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీకొట్టింది. స్పాట్ లోనే స్పృహ కోల్పోయిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు.. తల బలంగా తగలడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు వైద్యులు. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వీడియో సాక్ష్యం చెబుతోంది.

Posted in Uncategorized

Latest Updates