షాక్ అవుతాం అంట : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ స్టార్ట్

ntr-harssfఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేషన్ లోని మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి (ఏప్రిల్ 13) ప్రారంభం కాబోతున్నది. ఈ మేరకు అంతా సిద్ధం చేసిన డైరెక్టర్.. శరవేగంగా సినిమా పూర్తి చేసేందుకు తహతహలాడుతున్నాడు. ఈ మేరకు తార‌క్ పీఆర్ మ‌హేష్ కోనేరు త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా ప్రకటించాడు. రేప‌టి నుంచి మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.. త్రివిక్ర‌మ్  అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశారు. తార‌క్ కొత్త లుక్స్ లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ కొత్త అవతారం చూసి షాక్ అవ్వటం ఖాయం అంటున్నారు.

ఏప్రిల్ 13 నుంచి 25 వర‌కు హైదరాబాద్ లోనే తొలి షెడ్యూల్ జరుగుతుంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ ఉంటుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రూపొందనుంది. అజ్ణాతవాసి మూవీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్నా మూవీ కావటంతో ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళనగా ఉన్నారు. జాగ్రత్తగా సినిమా తీయాలని కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates