షాజాపూర్ లో అల్లర్లు…144 సెక్షన్ విధింపు

SHAమధ్యప్రదేశ్‌ లోని షాజాపూర్‌ లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హింసాకాండగా మారింది. పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 144 సెక్షన్ విధించారు. శనివారం(జూన్-16) మధ్యాహ్నాం నయీ సడక్ ఏరియాలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. అంతేకాకుండా పలు వాహనాలను, షాపులను తగులబెట్టారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించినట్లు కొట్వాలి సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ పదమ్ సింగ్ బగీల్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates