షాట్ అదిరింది : NTRకి కొత్త అర్థం చెప్పిన బాలయ్య

balakrishnaఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకు కొత్త అర్థం చెప్పారు ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ. N అంటే నట సింహుం, T అంటే తారా మండలంలో ధృవ తారకుడు, R అంటే రాజకీయ యుగంధరుడు అంటూ తెలిపారు. ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ముహూర్తపు షాట్ కి దుర్యోధనుడి గెటప్ లో కనిపించారు బాలయ్య. నాకు తండ్రి మాత్రమే కాదని.. గురువు, దైవం కూడా ఆయనే అన్నారు. ఆయన సినిమాలు మాత్రమే చూస్తూ పెరిగాను అన్నారు. ఆ మూడు అక్షరాల్లోనే పేదల హృదయ స్పందన ఉందన్నారు.

మార్చి 29వ తేదీతో ఎన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. పాతాళభైరవి, లవకుశ, దేశోద్దారకుడు సినిమాలు విడుదలయ్యి సినీ ఇండస్ట్రీలోనే కొత్త శకానికి నాంది పలికాయి అన్నారు. అంతే కాకుండా.. మార్చి 29వ తేదీనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అన్నారు. అలాంటి రోజునే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాకి ముహూర్తం షాట్ జరగటం విశేషం అన్నారు. అంతే కాకుండా.. ఆయన పాత్రలో నటించటం కూడా పూర్వ జన్మ సుక్రుతం అన్నారు.

Posted in Uncategorized

Latest Updates