షికాగో సెక్స్‌ రాకెట్‌ ఎఫెక్ట్: భారీగా వీసాల తిరస్కరణ

visa-rejectవీసాల విషయంలో ఆనేక ఆంక్షలు పెడుతున్న అమెరికా.. షికాగో సెక్స్ రాకెట్ తో మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో సినీ, టీవీ కళాకారులకు వీసాలు రాని పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఇండియా నుంచి…తానా, ఆటా, నాటా ఇలా ఏ సదస్సుకు హాజరవుతారు. ఇందుకోసం 60 శాతం నుంచి 75 శాతం దరఖాస్తు చేసుకుంటారు. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్‌ కాన్సులేట్‌ తిరస్కరించింది.

షికాగోలో సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటం.. ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్‌ అఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడమే దీనికి కారణం. షికాగోలోని ఓ తెలుగు  సినిమా సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్ల స్పష్ట కావడం… దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్‌ పూర్తిగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్‌ మార్క్‌ పెడుతోంది. వీసా కోసం ఆన్‌లైన్‌లో డీఎస్‌ 160 ఫామ్‌ సమర్పించాలి. ఆ ఫామ్‌లో  తెలిపిన వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తాడా? లేదా? అన్నదానికే పరిమితమవుతారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

మే నెలలో యూఎస్‌ వీసా కోసం వచ్చిన (B1,B2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్‌ మధ్యకు వచ్చేసరికి వీసా తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే.. 1,950 మందికి వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్‌ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి. తెలుగు సదస్సు పేరుతో అమెరికా వెళుతున్న వారు అక్కడకు వెళ్లి ఆరు నెలలు ఉండటం, కొంత మంది మరో మూడు మాసాలు పొడిగించాలని దరఖాస్తు చేయడం వంటివి లెక్కకు మించి ఉంటున్నాయి. షికాగోలో సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటంతో యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ విభాగం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates