షిల్లాంగ్ లో ఉద్రిక్త పరిస్ధితులు… ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

SHIమేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ మహిళకు, బస్ కండక్టర్ కు మధ్య జరిగిన గొడవ రెండు గ్రూప్ ల మధ్య గొడవలకు దారి తీసింది. సాయంత్రం ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. ఇవాళ ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు సంగ్మాను కలిసి చర్చలు జరిపాయి. రాష్ట్రంలో కొన్ని సమస్యలు గత 20-30 ఏళ్లుగా ఉన్నాయని… వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు కాన్రాడ్ సంగ్మా.

Posted in Uncategorized

Latest Updates