షుగర్ కు మందు: ‘తాబేలు’ గోలి

షుగర్  ఉన్న వారు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ప్రతిసారీ అలా ఇంజెక్షన్ చేసుకోవడంతో  నొప్పి వస్తుంది.ఆ నొప్పి లేకుండా అమెరికాలోని బ్రిగాం వుమెన్స్ హాస్పిటల్, మసాచు సెట్స్ ఇనిస్టిట్యూ ట్ ఆప్ టెక్నాలజీకి చెందిన డాక్టర్లు, సైంటిస్టులు సంయుక్తం గా ఓ ఇన్సులిన్ గోలిని తయారు చేశారు. ‘తాబేలు’ స్ఫూర్తిగా దానికి రూపమిచ్చారు. ముందుగా ఇన్సులిన్ ను ఫ్రీజ్ డ్రై  చేస్తారు. దానికి ఓ స్ప్రింగ్ ను అమర్చుతారు. ఆ మొత్తాన్ని చక్కెరతో చేసిన డిస్క్ తో కప్పేస్తారు. అంటే తాబేలు లాగన్నమాట. ఆ టాబ్లెట్ మొత్తాన్ని జెలాటిన్ గొట్టాల్లో పెడతారు. దాన్ని మింగ గానే జెలాటిన్ గొట్టంతో పాటుతో పాటు పైన ఉన్న చక్కెర డిస్క్ కరిగి స్ప్రింగ్ విడుదల అవుతుంది. ఆ స్ప్రింగ్ మందును కడుపులో వదలడానికి కొంచెం శక్తిని రిలీజ్ చేస్తుంది. దీంతో ఇన్సులిన్ కొద్దికొద్దిగా కడుపులో విడుదలై రక్తంలోని చక్కెరను నియంత్రి స్తుంది. లిక్విడ్ కు బదులుగా ఘన ఇన్సులిన్ ను ఎంచుకోవడానికి కారణాన్నీ సైంటిస్టులు వివరించారు. మామూలుగా అయితే లిక్విడ్ రూపంలో మందును కొద్ది మొత్తంలోనే తీసుకునే వీలుంటుందని, అది ఘన రూపంలో అయితే మందు కొంచెం ఎక్కువుంటుందని చెప్పారు.పందులపై ఈ మందును ప్రయోగించి సక్సెస్ అయ్యారు. 300మైక్రోగ్రాముల ఇన్సులిన్ శరీరంలోకి  విడుదలైనట్టు గుర్తించారు. నోవో నోర్డిస్క్  అనే కంపెనీతో కలిసి సైంటిస్టులు మందు అభివృద్ధిపై పని చేస్తున్నారు. వచ్చే మూడేళ్ల లో మనిషి పై ట్రయల్స్ చేసే అవకాశాలున్నా యంటున్నారు సైంటిస్టులు.

Latest Updates