షుగర్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్: ఆరుగురి మృతి

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఉన్న ఓ షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. జిల్లాలోని ముధోల్ లో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీలో బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో.. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆరుగురు  కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్ పేలుడు ధాటికి మూడంతస్థుల భవనం కుప్పకూలిపోయింది.

ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా అధికారులు,పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates