షూటింగ్ జరుగుతుండగానే : వరదల్లో కొట్టుకుపోయిన సినీ డైరెక్టర్

DIRECTORభారీ వర్షాలకు ఓ ప్రముఖ డైరెక్టర్ మృతి చెందిన సంఘటన కర్ణాటకలో జరిగింది. క‌న్న‌డ డైరెక్టర్ సంతోష్ శెట్టి.. బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్‌ ఫాల్స్‌ లో బుధవారం (మే-30) షూటింగ్ జ‌రుపుతున్న స‌మ‌యంలో వ‌ర‌ద ఉదృతికి కొట్టుకుపోయాడు. ఒక్క‌సారిగి నీటి ఉధృతి పెర‌గ‌డం కార‌ణంగానే ఆయ‌న అదుపుత‌ప్పి నీటిలో ప‌డి కొట్టుకుపోయాడ‌ని అంటున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లంలో సంతోష్ శెట్టి కోసం వెతుక‌గా ఆయ‌న విగ‌త జీవిగా క‌నిపించారు. మృత‌దేహాన్ని బెళ్తంగ‌డికి త‌ర‌లించి, ఆ త‌ర్వాత క‌టిల్‌ లోని ఆయన కుటుంబ స‌భ్యుల‌కి అప్ప‌గించారు. ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించింది క‌న్నడ సినీ ప‌రిశ్ర‌మ‌. రెండు రోజులుగా ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాల‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates