షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్ ధన్సిక

కోలీవుడ్ హీరోయిన్ ధన్సికకు గాయాలయ్యాయి. తెలుగులో వాలు జడ సినిమాలో నటిస్తున్న ధన్సిన ఈ మూవీ షూటింగ్‌ లో జరిగిన ప్రమాదంలో గాయపడింది. బార్‌ లో యాక్షన్ సీన్‌ షూట్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది రౌడీలు ధన్సికపైకి బీర్‌ బాటిళ్లను విసిరే సన్నివేశం షూట్ చేస్తుండగా పగిలిన గాజు ముక్క  ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది.

వెంటనే గమనించిన యూనిట్ సభ్యులు ఆమెను దగ్గరలోని హాస్పిటల్‌ కు తరలించారు. ధన్సిక ట్రీట్‌ మెంట్ పూర్తి అయిన వెంటనే గాయంతోనే తిరిగి షూటింగ్‌ లో పాల్గొన్నట్లు తెలిపింది సినిమా యూనిట్. ధన్సిక సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్‌ లోనూ అభిమానులను సంపాదించుకుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates