షెట్టర్ క్లోజ్ : రేపు, ఎల్లుండి బ్యాంకులు సమ్మె

bankబ్యాంకుల్లో పనులు ఉన్నాయా.. అర్జంటా.. వెరీ ఇంపార్టెంటా.. రేపు, ఎల్లుండి కంప్లీట్ చేసుకోవాలి అనుకున్న పనులు ఏమైనా ఉంటే.. ఇవాళే పూర్తి చేసుకోండి. ఎందుకంటే.. రేపు, ఎల్లుండి (మే 30, 31) బుధ, గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకులు పని చేయవు. 48 గంటల సమ్మె చేస్తున్నారు ఉద్యోగులు, సిబ్బంది. మళ్లీ బ్యాంకులు తెరుచుకునేవి శుక్రవారమే. అయితే నెలాఖరు కావటం.. మే 31వ తేదీన జీతాలు చెల్లించే సంస్థలు మాత్రం.. ఇవాళే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నాయి. నెల చివరిలో రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోవటంతో.. జూన్ 1, 2 తేదీల్లో జీతాలు చెల్లింపులోనూ కొంత ఆలస్యం కావచ్చంటున్నారు బ్యాంక్ ఉద్యోగులు. అందరివీ ఒకేసారి క్లియర్ చేయటం కష్టం కదా అంటున్నారు బ్యాంక్ సిబ్బంది.

బ్యాంక్ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులు. కనీసం 5శాతం జీతాల పెంపును డిమాండ్ చేయగా.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2శాతం మాత్రమే పెంచటానికి ఒప్పుకుంది. దీంతో సమ్మెబాట పట్టారు ఉద్యోగులు. ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఈ సమ్మెకి మద్దతు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మే 30, 31 తేదీల్లో పూర్తిగా లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates