షెడ్యూల్ ఇదే : మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

INTER EAMSఇంటర్నీడియట్ పరీక్షా ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్-13) విడుదలయ్యాయి. విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ కు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు ఈ నెల 20వ తేదీ వరకు గడువును విధించారు. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను సధ్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 14వ తేదీన ప్రారంభం కానున్నాయి. అదే నెల 22వ తేదీన ముగియనున్నాయి.

ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే..

-మే 14 నుంచి మే 22 వరకు ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు
-ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
– సెకండ్ ఇయర్  పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు
-ప్రాక్టికల్ పరీక్షలను మే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
-ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 29వ తేదీన, ఎన్విరాన్‌ మెంటల్ ఎగ్జామినేషన్ 30వ తేదీన నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates