షెడ్యూల్ రిలీజ్ : మే 23, 24 తేదీల్లో ఐసెట్‌

TSICET-2018ఐసెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ పాపిరెడ్డి. టీఎస్‌ ఐసెట్‌-2018 ప్రవేశ పరీక్షను మే 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. జనవరి 22న నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. మార్చి 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్‌ 30 వరకు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.

*మే ఐదో తేదీ వరకు రూ. 500, మే 10 వరకు రూ. 2 వేలు, మే 14 వరకు ఐదు వేల రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

*మే 7వ తేదీ నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు మే 23వ తేదీన రెండు సెషన్లలో, 24వ తేదీన ఒక సెషన్‌లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

* ప్రాథమిక కీ మే 25న విడుదల అవుతుంది. కీపై అభ్యంతరాలుంటే జూన్‌ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. జూన్‌ 6వ తేదీన ఫైనల్ కీ, ఫలితాలు విడుదల అవుతాయి.

*హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నర్సాపూర్‌ (మెదక్‌), నిజామాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్‌, కర్నూల్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

* దరఖాస్తు ధర రూ.650, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.450

Posted in Uncategorized

Latest Updates