షోయబ్ బావా… ఓ సారి ఇటు చూడు

ఆసియాకప్-2018లో భాగంగా….క్రికెట్ ప్రపంచం ఆతృతతో ఎదురుచూసే భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గెలిచి భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఓ ఆశక్తికరమైన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో…బౌండరీ దగ్గర నిలబడి ఉన్న షోయబ్ మాలిక్ ను భారత క్రికెట్ అభిమానులు సరదాగా ఆటపట్టించారు. షోయబ్ బావా ఒకసారి ఇటు చూడవా అంటూ కేకలు వేశారు. ఈ కేకలు విన్న షోయబ్…..వారి వైపు తిరిగి హాయ్ చెప్పారు.  ఈ వీడియోనుఅభిమానులు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు అది విపరీతంగా వైరల్ అవుతోంది.‌ ప్రముఖ భారత టెన్నిస్‌ ప్లేయర్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు.

ఐదు రోజుల క్రితం భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఓ పాక్ అభిమాని జాతీయగీతం పాడిన వీడియో, పాక్ క్రికెటర్ కు భారత బౌలర్ చాహెల్ షూ లేస్ కడుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Posted in Uncategorized

Latest Updates