సంకల్ప్ అంతరిక్ష యాత్రలో వరుణ్

VArun tej Sankalp Reddy Movie Openingసంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష యాత్ర సినిమా చేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్‌. ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్‌ తేజ్‌ హ్యాట్రిక్‌ సక్సెస్‌ కు రెడీ అవుతున్నాడు. ఘాజీ సినిమాతో ఆకట్టుకున్న సంకల్ప్‌… వరుణ్‌ తేజ్‌ను వ్యోమగామిగా చూపించనున్నాడట. దర్శకుడు క్రిష్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ రోజు (గురువారం) ప్రారంభించారు.

వరుణ్‌ సరసన అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్‌ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఘాజీ తరహాలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుణ్‌ తేజ్‌ హ్యాట్రిక్‌ సక్సెస్‌ మీద కన్నేశాడు.

Posted in Uncategorized

Latest Updates