సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం కుమార స్వామి

kumaraswamyకర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామన్నారు సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రజలు తమకు మెజారిటీ ఇచ్చారన్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం కుమారస్వామి. కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడటం కొత్త కాదని… 2004లో కూడా హంగ్‌ ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్‌కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

అంతకు ముందు అసెంబ్లీలో  సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది సభ్యుల మద్దతు ఉండగా… విపక్ష బీజేపీకి 104 మంది సభ్యుల బలం ఉంది.

Posted in Uncategorized

Latest Updates