రైల్వే స్టేషన్లపై సంక్రాంతి ఎఫెక్ట్ : ప్లాట్ ఫామ్ టికెట్ రూ.20/-

 హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో… రైల్వే అధికారులు రైళ్ల సంఖ్యతో పాటు… రేట్లను కూడా పెంచడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని ప్రధాన స్టేషన్లనుంచి.. తెలంగాణ, ఏపీలకు పలు అదనపు సర్వీసులను నడపనున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. అదనపు రైళ్లలో టికెట్ ధర కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను కూడా పెంచబోతున్నారు అధికారులు.

జనవరి 9 నుండి 17 వరకు సంక్రాంతి సీజన్ లో… ప్లాట్ ఫామ్ టికెట్ కు రూ.20 వసూలు చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ఉంది. స్టేషన్లలో రద్దీని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే… ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచాలని నిర్ణయించామని వివరించారు అధికారులు. కాచీగూడలో మాత్రం ఎటువంటి చార్జీలను పెంచటం లేదని తెలిపారు.

 

 

Posted in Uncategorized

Latest Updates