సంక్రాంతి కానుక… జనవరి 9న “NTR కథానాయకుడు”

హైదరాబాద్ : నందమూరి అభిమానులకు సంక్రాంతికి ప్రత్యేక కానుక అందనుంది. యువరత్న బాలకృష్ణ టైటిల్ రోల్ లో రూపొందుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ ను “ఎన్టీఆర్- కథానాయకుడు” అని ప్రకటించారు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. సినిమాను 2019 జనవరి 9న విడుదల చేస్తున్నామని అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. జానపద కథానాయకుడిగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య బ్లాక్ అండ్ వైట్ స్టిల్ ను పోస్ట్ చేశారు క్రిష్.

ప్రతి కథకు ఓ నాయకుడు ఉంటాడు.. కానీ కథగా మారే నాయకుడు ఒక్కడే ఉంటాడు అని తన పోస్ట్ లో చెప్పాడు డైరెక్టర్ క్రిష్. #NTRకథానాయకుడు అంటూ హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని రెండు వాక్యాల్లో వివరించాడు డైరెక్టర్. కథగా మారిన నాయకుడు అయ్యాడు కాబట్టే… సినిమాకు కథా నాయకుడు అని పేరు పెట్టినట్టు చెప్పాడు. బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో పాపులర్ యాక్టర్స్ నటిస్తున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates