సంక్రాంతి తర్వాతే అసెంబ్లీ!

హైదరాబాద్:  రాష్ట్ర రెండో అసెంబ్లీ తొలి సమావేశాలు సంక్రాంతి తర్వాత జరగనున్నాయి. డిసెంబర్‌‌లో అసెంబ్లీని సమావేశ పరిచి, మళ్లీ మరో రెండు నెలలకే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసే బదులు ఒకేసారి నిర్వ హించడం మంచిదని సీఎం కేసీఆర్‌‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఈలోగా మంత్రివర్గ కూర్పు, స్పీకర్‌‌, డిప్యూటీ స్పీకర్‌‌ ఎంపిక తదితర కసరత్తులు పూర్తిచేయాలని ఆయన అనుకుంటున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.

సంక్రాంతి తర్వాత కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించి, తర్వాత స్పీకర్‌‌ను ఎన్నుకొని సభను వాయిదా వేస్తే సరిపోతుందని సీఎం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం, సాధారణ, బడ్జెట్ సమావేశాలు మూడు  ఒక్కసారే నిర్వహించే అవకాశం ఉన్నా, కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో ప్రమాణ స్వీకారాన్ని కాస్త ముందుగానే నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని తెలుసుకున్న ఆశావహులు హైదరాబాద్‌ను వదిలి సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నారు. టీఆర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌తో పాటు ఎమ్మెల్యేలు హరీశ్‍రావు, ఈటల రాజేందర్‌‌ కూడా సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates