సంక్షేమ పథకాల అమలు కోసం 40వేల కోట్లు ఖర్చు: కేటీఆర్

సంక్షేమ పథకాల అమలు కోసం 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్ . ఎకరానికి 8వేల రూపాయలు పెట్టుబడి పథకంతో … రైతులు సమస్యల నుంచి బయటపడుతారన్నారు. రైతు బీమా కూడా అద్భుతమైన పథకమన్నారు కేటీఆర్. హైదరాబాద్ తాజ్‌కృష్ణలో సీఐఐ సదరన్ రీజియన్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్నారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 30వేల చెరువులను బాగు చేశామన్నారు. మరో రెండు మూడు నెలల్లో ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామన్నారు కేటీఆర్.  వందరోజుల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేశామని.. తెలంగాణలో 58 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. భూముల రికార్డుల నిర్వహణలో పలు మార్పులు జరిగాయని తెలిపారు. అంతే కాదు హరితహారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates