సంఖ్యాబలం ఆధారంగానే శాఖల కేటాయింపు : సిద్దరామయ్య

SIDDAకర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. మంత్రుల శాఖల కేటాయింపుపై రాహుల్ గాంధీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మాజీ సీఎం సిద్దారామయ్య. శాఖలపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు మాజీసీఎం. సంఖ్యాబలం ఆధారంగానే శాఖల కేటాయింపు ఉంటుందన్నారు సిద్దారామయ్య. మంత్రుల శాఖల కేటాయింపుపై ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చే బాధ్యత తనదేనన్నారు కుమారస్వామి. రైతులను రెచ్చగొట్టే విధంగా యడ్యూరప్ప మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడానికి నేను యడ్యూరప్పను కాదని.. తాను కుమారస్వామినంటూ కౌంటర్ ఎటాక్ చేశారు కర్ణాటక సీఎం.

Posted in Uncategorized

Latest Updates