సంచలన నిర్ణయం : డ్రగ్స్ అమ్మితే మరణ శిక్ష

drugsపంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారు.. స్మగ్లింగ్ చేసేవారికీ మరణశిక్ష విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి డ్రగ్స్ సప్లయ్ దారులు యువత జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను అమ్మేవారికి కఠినమైన శిక్ష విధించాలన్నారు సీఎం అమరీందర్ సింగ్.

పాకిస్తాన్ నుంచి  డ్రగ్స్ సరఫరా అవుతుండటం.. ఎక్కువ మంది దీనికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు ఎడిక్టియ్యారు. చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో పాటు క్రైం రేటు కూడా ఎక్కువగా పెరిగింది.  2017 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రగ్స్ నిషేధమే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేపట్టాయి. అధికారంలోకి రాగానే డ్రగ్స్ ను అరికడతామని హామీ కూడా ఇచ్చాయి. హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ అధికారం లోకి రాగానే డ్రగ్స్ పై కఠిన చర్యలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. డ్రగ్స్ విక్రయించే వారికి, సప్లయ్ చేసే వారికి మరణ శిక్ష విధించే విధంగా చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు ఫిలిఫ్పీన్ లో  డ్రగ్స్ నేరస్ధులని తానే స్వయంగా కాల్చి చంపేసినట్లు  ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుత్రేట్ కూడా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates