సంజనా ఔట్, నందిని ఇన్ : బిగ్ బాస్-2లో ఎందుకిలా

sanjana  బిగ్‌బాస్ సీజన్‌ 2లో ఎలిమినేషన్ ల పర్వం మొదలైంది. ఫస్ట్ గా ఆదివారం(జూన్-17) ఎపిసోడ్ లో సంజనా అన్నే ఎలిమినేట్‌ అ‍య్యారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుంచి కాంట్రవర్శీలకు కేరాఫ్ గా మారారు సంజనా. దీంతో బిగ్ బాస్ కుటుంబ సభ్యులు తొలి వారం ఎలిమినేషన్‌ కు సంజనాను నామినేట్ చేశారు. ఓటింగ్‌ లో ఆడియన్స్ నుంచి కూడా ఓట్లు తక్కువగా రావడంతో సంజనా హౌస్ నుండి బయటకు వచ్చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో తేజస్వి, బాబు గోగినేనిల పై విమర్శలు చేశారు సంజనా. బాబుగోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి బాబుగోగినేని కాదని తెలిపారు. తేజస్వి పక్క వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు. ఎలిమినేట్ అయిన సంజనకు బిగ్ బాస్ .. బిగ్ బాంబ్ ఒకరిపై ప్రయోగించే అవకాశం ఇవ్వగా, బాబు గోగినేనిపై దాన్ని ప్రయోగించింది సంజనా. దీని ప్రకారం ఈ వారం మొత్తం ఎవరికి మంచి నీళ్లు కావల్సివచ్చినా వారికి బాబు గోగినేనే నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలిమినేట్‌ అయిన సంజన స్థానంలో  హీరోయిన్‌  నందినీ ఎంట్రీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates