సంజు-చారు ఒక్కటయ్యారు

తిరువనంతపురం: యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు చారులతతో శనివారం తిరువనంతపురంలో సంజు పెళ్లి ఘనంగా జరిగింది. తిరువనంతపురంలోని ఓ కాలేజీలో కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ లో సంజుకి చారులతతో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి శుభం కార్డు పడింది.

2015 జులైలో భారత్ తరఫున ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు సంజు. IPL తో వెలుగులోకి వచ్చిన శాంసన్.. టీ20 క్రికెట్లో స్టార్ క్రికెటర్‌ గా ఎదిగాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ లో కొనసాగుతున్నాడు. గతేడాది వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌ మన్ శాంసన్‌ ను రూ.8కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. రంజీ ట్రోఫీలో సంజు కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం చారులత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. సంజు-చారు ఒక్కటైన సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.

Posted in Uncategorized

Latest Updates