సందడే సందడి : ఒకేరోజు నాలుగు వేల పెళ్లిళ్ళు

KKDరాష్ట్రమంతా పెళ్లిళ్ళ సందడి మొదలైంది. ఫిబ్రవరి- 16 వరకు మూఢాలు ఉండటంతో వివాహాలు  జరగలేదు. 17 నుంచి ఫాల్గుణ మాసం రావడంతో.. శుభకార్యాలకు రెడీ అవుతున్నారు జనం. మే 13వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో వేలల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయని చెబుతున్నారు పురోహితులు.  రాష్ట్రంతోపాటు నగరంలోని మండపాలు, ఫంక్షన్  హాళ్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియో, పురోహితులు టెంట్  హౌస్ లకు డిమాండ్  పెరిగింది.

పట్టణాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్, ప్లవర్స్  డెకరేషన్  ట్రూప్స్, బ్యాండ్  వాలాలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. మూడునెలల ముందు నుంచే మండపాల బుకింగ్ జరుగుతోంది. మార్చి 4న మంచి మూహుర్తం ఉండటంతో  ఆ రోజు ఫంక్షన్ హాల్స్  కోసం పోటీ పడుతున్నారు. మార్చి 4న దివ్యమైన మూహుర్తమే ఉందంటున్నారు వేద పండితులు. ఆ రోజు హైదరాబాద్ లో  నాలుగు వేల పెళ్ళిల్లు ఉన్నాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత జూన్  16 నుంచి జూలై 11 వరకు పెళ్ళిళ్ళు జరుగుతాయి.  పెళ్ళిల్ల సీజన్ కావడంతో.. అటు షాపింగ్ మాల్స్ లోనూ రద్దీ కనిపిస్తోంది.  షాపుల నిర్వాహకులు కూడా కూడా భారీగా ఆఫర్లు ప్రకటించి జనాన్ని ఆకట్టుకుంటున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates