సంపాదనలో ధోనీని దాటేసిన‌ కోహ్లీ

అత్యధికంగా సంపాదిస్తున్న భారత సెలబ్రిటీల జాబితాను  ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. టాప్-100 జాబితాలో మొదట సల్మాన్ ఖాన్ నిలిచారు.  క్రికెటర్లలో… టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందున్నాడు. విరాట్ తరువాత.. మహేంద్రసింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు.ఈ లిస్టులో స్పోర్ట్స్ నుంచి ఎక్కువ మంది క్రికెటర్లే ఉన్నారు.

ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో మొదటగా సల్మాన్ ఖాన్ 253.25కోట్లతో ముందున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ రూ.228.09కోట్ల సంపాదనతో జాబితాలో రెండో స్థానంలో నిలవగా.. మాజీ సారథి ధోనీ రూ.101.77కోట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 సెలబ్రిటీలు వరుసగా..

1.సల్మాన్ ఖాన్(రూ.253.25కోట్లు)

2.విరాట్ కోహ్లీ(రూ.228.09కోట్లు)

3.అక్షయ్ కుమార్(రూ.185కోట్లు)

4.దీపికా పదుకొణె(రూ.112.8కోట్లు)

5.ఎమ్మెస్ ధోనీ(రూ.101.77కోట్లు)

  1. ఆమిర్ ఖాన్(రూ.97.5కోట్లు)

7.అమితాబ్ బచ్చన్(రూ.96.17కోట్లు)

8.రణ్‌వీర్ సింగ్(రూ.84.67కోట్లు)

9.సచిన్ టెండూల్కర్(రూ.80కోట్లు)

10.అజయ్ దేవగణ్(రూ.74.5కోట్లు)

Posted in Uncategorized

Latest Updates