సంపూ మంచి మనసు.. తిత్లీ బాధితులకు విరాళం

తిత్లీ తుఫాన్ బాధితులకు విరాళం అందించి సినీ యాక్టర్ సంపూర్ణేష్ బాబు తన మంచి మనసు చాటుకున్నాడు. పెను తుఫానుతో సర్వం కోల్పోయిన బాధితులకు సాయమందించేందుకు ఏపి సిఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50,000 ఆర్ధిక సాయం ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. తిత్లీతో చాలా నష్టం జరిగిందని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నానని.. అందరూ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని సంపూ ట్వీట్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates