సచిన్ పవార్ తో నాకు సంబంధంలేదు : నటి దేవొలీనా

ముంబై: వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉదాని హత్య కేసులో అరెస్ట్ అయిన సచిన్ పవార్‌ తో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీ. తాను తన తల్లితో కలిసి ఉంటున్నానని చెప్పింది. సచిన్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని తెలిపింది. ఉదానీ హత్య కేసులో తనను అరెస్ట్ చేసినట్టు వచ్చిన వార్తలను ఖండించింది. పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ప్రశ్నించడానికి మాత్రమే పిలిచారని వివరించింది.

దేవొలీనాను అరెస్ట్ చేసినట్టు వచ్చిన వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు. వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ హత్య కేసులో దేవొలీనాను అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘దేవొలీనాను మేం నిర్బంధించలేదు. ఇప్పుడామె మాతో లేదు’’ అని తెలిపారు. దేవొలీనా కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ దర్యాప్తులో భాగంగా తనను పిలిచారని చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates