సడన్ విజిట్ : హైదరాబాద్ లో గాలి దుమారం, భారీ వర్షం

rainహైదరాబాద్ గాలి దుమారం, భారీ వర్షం పడుతుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. ఆకాశం మేఘావృతం అయ్యింది. ఈదురు గాలులతోపాటు, వర్షం మొదలైంది. మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. గాలుల బీభత్సానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరు గంటలకే చీకట్లు అలుముకున్నాయి.

కాచిగూడ, కోఠి, అబిడ్స్, మీర్ పేట ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది. లక్డీకపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, మెహదీపట్నంలో పడుతున్న వానతో.. ట్రాఫిక్ జాం అయ్యింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావటంతో చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రోడ్లపై నీళ్లు నిలవటంతో వాహనాలు నిదానంగా వెళుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్డు పక్కన వర్క్ నడుస్తోంది. తవ్వకాలు జరిపారు. దీంతో వెహికల్స్ మరింత స్లోగా వెళుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates