సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమ సింఘే. మహా ద్వారం గుండా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాణిల్ విక్రమ సింఘే దంపతులకు వేదపండితులు వేదశీర్వచనం చేశారు. రాణిల్ విక్రమ సింఘే దంపతులకు స్వామి వారి చిత్రపటం తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు.

అనంతరం మీడియాతో మాట్లాడిన విక్రమసింఘే స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం పరస్పర సహకారంతో డీప్ సీ ఫిషర్ మెన్ సమస్యలు సానుకూలంగా పరిష్కరమైందన్నారు విక్రమసింఘే. యునైటెడ్ నేషన్ సెక్యురిటి కౌన్సిల్ లో భారత దేశం సభ్యత్వనికి శ్రీలంక ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates