సత్యసాయిబాబా వేషధారణలో శివప్రసాద్

ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ విచిత్ర వేసధారణలతో ఆకట్టుకునే TDP ఎంపీ శివప్రసాద్..మంగళవారం (జూలై-31) మరో గెటప్ తో దర్శనమిచ్చారు. సత్యసాయిబాబా వేషధారణలో ఆయన మంగళవారం ఉదయం పార్లమెంట్‌ కు వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. గతంలో ఓ విద్యార్థిగా, నారదమునిగా.. రకరకాల వేషధారణతో ఎంపీ శివప్రసాద్ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అస్సోంలో 40 లక్షల మందిని సిటిజన్స్ లిస్టు నుంచి తీసివేసిన అంశంపై టీఎంసీ ఎంపీలు లోక్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు.

Posted in Uncategorized

Latest Updates